కులగణన సర్వేకు పబ్లిక్సహకరించాలని, అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతనే ప్రశ్నలు తయారు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమే అని.
ఎలాంటి పత్రాల జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించి ఎన్యుమరేటర్లకు సర్వే కిట్ అందజేశారు. ఈసందర్భంగా మంత్రి (Ponnam Prabhakar) మాట్లాడుతూ ‘రాష్ట్రవ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇండ్లు ఉన్నాయి. సర్వే కోసం 87, 900 ఎన్యుమరేటర్లను, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ నియమించాం. మొదటి 3 రోజులు ఇండ్లకు స్టిక్కర్ అంటిస్తారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు సేకరిస్తారు. ఏ రోజుకు ఆరోజు వివరాలు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తం. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్ లో న్యాయం జరిగేలా చేస్తాం. కొందరు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. వారి మాటలు ప్రజలు నమ్మొద్దు. ఏమైనా సమస్యలు ఉంటే నన్ను అడగండి. ప్రజల సహకారం ఉంటేనే సర్వే సక్సెస్ అవుతుంది’ అని తెలిపారు.

Also Read :