TTD: శ్రీవాణి ట్రస్ట్ రద్దు

TTD

సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని (TTD) తితిదే నిర్ణయించింది. (TTD) తితిదేలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. సమావేశం వివరాలను బీఆర్‌ నాయుడు మీడియాకు తెలిపారు. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్​కు గరుడ వారధిగా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘ తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేస్తున్నాం. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం’ అని బీఆర్‌ నాయుడు అన్నారు.

Image

సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తితిదే నిర్ణయించింది. తితిదేలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. సమావేశం వివరాలను బీఆర్‌ నాయుడు మీడియాకు తెలిపారు. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్​కు గరుడ వారధిగా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘ తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేస్తున్నాం. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం’ అని బీఆర్‌ నాయుడు అన్నారు.

Image

Also read: