Patnam: పట్నం పిటిషన్​పై తీర్పు రిజర్వ్

Patnam

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే (Patnam) పట్నం నరేందర్‌ రెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. నరేందర్‌ రెడ్డి తరఫున గండ్ర మోహన్‌ రావు వాదనలు వినిపించారు. పోలీసులు అరెస్టు సమయంలో గైడ్ లైన్స్ ఫాలో కాలేదని.. (Patnam) పట్నం నరేందర్ అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కింది కోర్టు పాటించలేదని చెప్పారు. 71 రోజుల్లో 84 సార్లు ఫోన్ లో మాట్లాడారని అరెస్టు చేయడం సరికాదన్నారు.

అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిర పరించేందుకు కుట్ర చేశారని.. కలెక్టర్, అధికారుల మీద దాడులు చేయించారని తెలిపారు. అన్నింటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని.. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని చెప్పారు. ఘటన జరిగిన రోజు సురేశ్ నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు.

Image

ఎందుకలా అరెస్టు చేశారు?: హైకోర్టు
కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేబీఆర్‌ పార్కు వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. సుప్రీంకోర్టు తీర్పులను ఎందుకు పాటించలేదని.. నరేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారా అని పీపీని ప్రశ్నించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని హైకోర్టు పేర్కొంది. తీవ్రగాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి.. చిన్న గాయాలైనట్లు రాశారని చెప్పింది. మధ్యాహ్నం వరకు ప్రత్యక్ష సాక్షుల కేసు స్టేట్మెంట్స్ సమర్పించాలని పీపీని ఆదేశించింది. ఇరువర్గాల వాదనలు విన్నకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Also read: