Marriage: 300 మంది గెస్టుల మధ్య చైతు, శోభిత పెళ్లి!

Marriage

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి (Marriage) 300 మంది అతిథుల సమక్షంలో తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. వచ్చే నెల 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరగబోయే ఈ కార్యక్రమానికి ఇప్పటినుంచే చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శోభిత, నాగ చైతన్యనే పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నారని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ఇది మా నాన్నగారి శతజయంతి సంవత్సరం. అన్నపూర్ణ స్టూడియోస్‌ నాగచైతన్య- శోభితల పెళ్లికి వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు.. మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నగారికి ఇష్టమైన ప్రదేశం. చైతన్య తన పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడు. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని కోరారు. నాకు కూడా ఆ మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Image ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్‌ వివరాలు ఇప్పుడే చెప్పలేను’అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి (Marriage) 300 మంది అతిథుల సమక్షంలో తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరగనుంది.

వచ్చే నెల 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరగబోయే ఈ కార్యక్రమానికి ఇప్పటినుంచే చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శోభిత, నాగ చైతన్యనే పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నారని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ఇది మా నాన్నగారి శతజయంతి సంవత్సరం.

అన్నపూర్ణ స్టూడియోస్‌ నాగచైతన్య- శోభితల పెళ్లికి వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు.. మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నగారికి ఇష్టమైన ప్రదేశం. చైతన్య తన పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడు. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని కోరారు. నాకు కూడా ఆ మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్‌ వివరాలు ఇప్పుడే చెప్పలేను’అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

Also read: