దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి (Tummala Nageswara Rao) తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వీసీ విషయంలో10 ఏండ్ల నుంచి చాలా నిర్లక్ష్యం జరిగిందన్నారు. సైఫాబాద్ లోని కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ఫ్లైయేర్, లోగోని వ్యవసాయశాఖ కమిషనర్ కోదండరెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, యూనివర్సిటీ వీసీ జానయ్యతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం తుమ్మల మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏరికోరి చాలా రోజుల తర్వాత వీసీ నియామకం చేసింది. ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి గొప్ప అగ్రికల్చర్ యూనివర్సిటీని ప్రారంభించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు మనం దిక్సూచిగా ఉండాలి. దాదాపు 47 వేల కోట్లు వ్యవసాయానికి బడ్జెట్ లో పెట్టుకున్నం. మహబూబ్ నగర్ లో రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. దీనిలో యూనివర్సిటీ భాగస్వామ్యం ఉండాలి. 60 ఏండ్లలో వచ్చిన ఫలితాలకు సంతృప్తి చెందకుండా ఇంకా ముందుకు వెళ్లాలి. ప్రభుత్వం పరంగా మా సాయం ఉంటుంది. యూనివర్సిటీ ఆ దిశగా ముందుకు వెళ్లాలి’ అని సూచించారు.

దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి (Tummala Nageswara Rao)తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వీసీ విషయంలో10 ఏండ్ల నుంచి చాలా నిర్లక్ష్యం జరిగిందన్నారు. సైఫాబాద్ లోని కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ఫ్లైయేర్, లోగోని వ్యవసాయశాఖ కమిషనర్ కోదండరెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, యూనివర్సిటీ వీసీ జానయ్యతో కలిసి ఆవిష్కరించారు.

Also read: