Ek Nath Shinde: సీఎం పదవికి షిండే రాజీనామా

Ek Nath Shinde

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే (Ek Nath Shinde) రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, ముఖ్యనేతలు ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలన గడువు ఇవాళ్టితో ముగియనుంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) 48 సీట్లకే పరిమితమైంది. మెజార్టీ సీట్లలో బీజేపీ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ లో సీఎం అవకాశం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

Eknath Shinde - Wikipediaశివసేన (షిండే) పార్టీ మాత్రం ఏక్‌ నాథ్ షిండేకు మరో సారి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతోంది. అజిత్ పవార్ సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను దేవేంద్ర ఫడ్నవిస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనేది బీజేపీ అధినాయకత్వం నిర్ణయించే అవకాశం ఉంది.

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే (Ek Nath Shinde) రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

The rise of Eknath Shinde: From auto driver to Maharashtra CM | Today Newsషిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, ముఖ్యనేతలు ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలన గడువు ఇవాళ్టితో ముగియనుంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) 48 సీట్లకే పరిమితమైంది. మెజార్టీ సీట్లలో బీజేపీ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ లో సీఎం అవకాశం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. శివసేన (షిండే) పార్టీ మాత్రం ఏక్‌ నాథ్ షిండేకు మరో సారి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతోంది. అజిత్ పవార్ సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను దేవేంద్ర ఫడ్నవిస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనేది బీజేపీ అధినాయకత్వం నిర్ణయించే అవకాశం ఉంది.