Kamareddy : సుపారీ ఇచ్చి కొడుకును చంపించిన తండ్రి

కామారెడ్డి జిల్లా(Kamareddy) లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వేధింపులు భరించలేక ఓ తండ్రి.. కన్న కొడుకునే చంపించాడు. రెండు రోజుల క్రితం ఉగ్రవాయి గ్రామ శివారులో జరిగిన హత్య కేసు వివరాలను కామారెడ్డి రూరల్ సీఐ రామన్ మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా (Kamareddy) కేంద్రంలోని గోసంగి కాలానికి చెందిన కోదండం రాజు కొద్దిరోజులుగా తాగుడుకు బానిసయ్యాడు. మద్యంమత్తులో ప్రతి రోజూ తన తండ్రి సాయిలు, తల్లి, ఇద్దరు చెల్లెల్లను కొట్టడం, తిడుతూ ఉండేవాడు. అతను చేసే మానసిక, శారీరక వేధింపులను భరించలేకపోయిన తండ్రి సాయిలు కొడుకును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ అనే వ్యక్తికి ఒక లక్ష రూపాయలకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. అనంతరం తండ్రి పోలీస్ స్టేషన్ కు వచ్చి చేసిన తప్పును ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు.

 

Also read :

Keerthy Suresh :పాపం శైలజ

Africa: ఫుట్ బాల్ మ్యాచ్ లో వివాదం 100 మంది మృతి