ఐకానిక్ స్టార్ బన్నీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప ది రూల్ (Pushpa 2)కు ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. నగరంలో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వెనుక పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు జరపనున్నారు. ఇందుకోసం సిటీలో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రీ సేల్ టికెట్ల బుకింగ్ లో లక్ష టికెట్లను దాటేసింది ఈ సినిమా(Pushpa 2).. ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్‌లో జోరు చూపించిన ఈ సినిమా(Pushpa 2) తాజాగా నార్త్‌లోనూ ఓ రేంజ్లో అమ్ముడువుతున్నాయి. హిందీ వెర్షన్‌లో టికెట్స్ ఓపెన్ చేయగా, నిమిషాల్లోనే టికెట్లన్నీస్పీడ్గా బుక్ అవుతున్నాయి. అక్కడ 24 గంటల్లోనే ఏకంగా లక్ష టికెట్స్ సేల్ అయ్యాయని తెలుస్తోంది. ఈ బుకింగ్స్‌తో ‘పుష్ప 2‘ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే బీటౌన్‌లో రికార్డులు సృష్టించిన టైగర్3 (65,000), యానిమల్ (52,500), డంకీ (42,000), స్త్రీ 2 (41,000) సినిమాలను ‘పుష్ప2‘ (Pushpa 2)బీట్ చేసింది.
Also read ;
Kamareddy : సుపారీ ఇచ్చి కొడుకును చంపించిన తండ్రి

