పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఇవాళ ఉభయసభలు ప్రారంభంకాగానే విపక్ష నేతలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వీటిని స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. దీంతో లోక్ సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ హాల్ ముందు నిరసనకు దిగారు. కార్యక్రమానికి సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ ఎంపీలు గైర్హాజయ్యారు. “సభను నడపడానికి మేము అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఎందుకంటే సమస్యలపై తమ వాయిస్ వినిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రభుత్వం సభను నడపాలనుకుంటే నడుస్తుంది. లేదనుకుంటే వారి కుట్రలు వారికుంటాయి. అది అందరికీ తెలిసిందే. సభను నడపటం మా బాధ్యత కాదని, కుర్చీలో కూర్చొని పదవుల్లో ఉన్నవారే దీనికి బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. మరోవైపు రాజ్యసభలో ఫెంగల్ తుపానుపై చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం తుపాను పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. భారీ వర్షాలు, వరదలు తమిళనాడును ముంచెత్తాయి.
పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఇవాళ ఉభయసభలు ప్రారంభంకాగానే విపక్ష నేతలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వీటిని స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. దీంతో లోక్ సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ హాల్ ముందు నిరసనకు దిగారు.
కార్యక్రమానికి సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ ఎంపీలు గైర్హాజయ్యారు. “సభను నడపడానికి మేము అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఎందుకంటే సమస్యలపై తమ వాయిస్ వినిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం సభను నడపాలనుకుంటే నడుస్తుంది. లేదనుకుంటే వారి కుట్రలు వారికుంటాయి. అది అందరికీ తెలిసిందే. సభను నడపటం మా బాధ్యత కాదని, కుర్చీలో కూర్చొని పదవుల్లో ఉన్నవారే దీనికి బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. మరోవైపు రాజ్యసభలో ఫెంగల్ తుపానుపై చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం తుపాను పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. భారీ వర్షాలు, వరదలు తమిళనాడును ముంచెత్తాయి.
Also read:

