ఆటో కార్మికులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దని మంత్రి (Ponnam) పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇవాళ హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ ఆటో యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మంత్రి (Ponnam) పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. త్వరలోనే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ‘ ఆటో కార్మికులు ఆందోనళ చెందాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పే అసత్య ప్రచారాలను నమ్మి, ఆటో సోదరులు మోసపోవద్దు. వాళ్లు మీతో రాజకీయం చేస్తారు తప్ప సమస్యలు పరిష్కరించడం వాళ్లకు చేతకాదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కంకణం కట్టుకున్నారు. సమస్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసే ఆలోచన వాళ్లకు లేదు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. వాళ్ల ఉచ్చులో పడి మీ కుటుంబాలను ఆగం చేసుకోవద్దు. ఆటో కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్దంగా ఉంది.’ అని మంత్రి పొన్నం అన్నారు.

ప్రజాస్వామ్య విలువలతో.. ప్రజా పాలన
ప్రజాస్వామ్య విలువలతో, ప్రజాస్వామబద్దంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కంప్లీట్అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు థ్యాంక్స్ చెబుతూ మంత్రి పొన్నం వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో నా బాధ్యతను చూసి, నన్ను గెలిపించిన హుస్నాబాద్ ప్రజలను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఏడాదిలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. రాబోయే నాలుగేండ్లలో కూడా ప్రజలకు అనుగుణంగా బాధ్యతగా పనిచేస్తం. ఈ ఏడాది కాలం ఏ విధంగా ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి ప్రజా ప్రభుత్వానికి సహకరించారో.. రాబోయే కాలంలో కూడా అదే విధంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, ప్రజా ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Also read:

