తెలంగాణలో రాబోయేది బీసీ సర్కారేనని, రాష్ట్రంలో ఇదే చివరి ఓసీ ప్రభుత్వం అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Mallanna) అన్నారు. భవిష్యత్లో అన్ని పార్టీల నాయకులను కలుపుకుని బీసీ ఉద్యమాలతో మరింత ముందుకు వెళ్తామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈడబ్ల్యూఎస్ కోటాలో వేలాది ఉద్యోగాలు బీసీల నుంచి ఎత్తుకుపోయారన్నారు. ‘ దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల్లో రాజకీయ చైతన్యం మొదలైంది. (Mallanna) బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కలనే ఆకాంక్ష బలంగా వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఓట్లతోనే రాజకీయం చేస్తున్నాయి. బీసీలకు చట్టపరంగా రావాల్సిన వాటా దక్కాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలను కులాల పరంగా గణన చేయాలి. తెలంగాణలో దిగ్విజయంగా కులగణన కార్యక్రమం జరుగుతోంది. వెనుకబడిన తరగతుల పేరుతో , వాళ్లు అన్ని రకాలుగా వెనుక పడుతూనే ఉన్నారు. బీసీలను మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 60 శాతం ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు చేయడం అన్యాయం. ఓబీసీల హక్కుల సాధన కోసం,ఈనెల 11న ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్కబ్ల్లో ఓబీసీల జాతీయ సదస్సు , ధర్నా నిర్వహిస్తాం. పార్లమెంట్ సమావేశాల్లో ముక్తకంఠంతో తెలంగాణ ఎంపీలు ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలి’ అని తీన్మార్ మల్లన్న అన్నారు.
తెలంగాణలో రాబోయేది బీసీ సర్కారేనని, రాష్ట్రంలో ఇదే చివరి ఓసీ ప్రభుత్వం అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. భవిష్యత్లో అన్ని పార్టీల నాయకులను కలుపుకుని బీసీ ఉద్యమాలతో మరింత ముందుకు వెళ్తామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈడబ్ల్యూఎస్ కోటాలో వేలాది ఉద్యోగాలు బీసీల నుంచి ఎత్తుకుపోయారన్నారు. ‘ దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల్లో రాజకీయ చైతన్యం మొదలైంది. బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కలనే ఆకాంక్ష బలంగా వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఓట్లతోనే రాజకీయం చేస్తున్నాయి. బీసీలకు చట్టపరంగా రావాల్సిన వాటా దక్కాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలను కులాల పరంగా గణన చేయాలి. తెలంగాణలో దిగ్విజయంగా కులగణన కార్యక్రమం జరుగుతోంది. వెనుకబడిన తరగతుల పేరుతో , వాళ్లు అన్ని రకాలుగా వెనుక పడుతూనే ఉన్నారు. బీసీలను మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 60 శాతం ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు చేయడం అన్యాయం. ఓబీసీల హక్కుల సాధన కోసం,ఈనెల 11న ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్కబ్ల్లో ఓబీసీల జాతీయ సదస్సు , ధర్నా నిర్వహిస్తాం. పార్లమెంట్ సమావేశాల్లో ముక్తకంఠంతో తెలంగాణ ఎంపీలు ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలి’ అని తీన్మార్ మల్లన్న అన్నారు.

