Cinema: సినిమా వార్తలు..

Cinema actor urfi arrest

ఊర్వశి పోస్ట్​.. పంత్​పై ట్రోలింగ్​

బాలీవుడ్​ నటి ఊర్వశి రౌతెలా తాజా పోస్ట్​ ఒకటి నెటిజన్లలో చర్చకు దారితీసింది. బ్యాటింగ్​ గ్లౌజులు వేసుకుని వికెట్​ కీపింగ్​ చేస్తున్న వీడియోను ఆమె షేర్​ చేసింది. దీనికి కొత్త ఆరంభం.. కొత్త సినిమా అంటూ క్యాప్షన్​ ఇచ్చింది. ఇందులో మాట్లాడుకోవడానికి ఏం లేకపోయినా కొందరు ఈ వీడియోతో క్రికెటర్​ రిషభ్​ పంత్​పై ట్రోలింగ్​కి దిగారు. ఆమె వికెట్​ కీపింగ్​ చూసి పంత్​కి లైటర్​ వర్షన్​లా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఈ క్రికెటర్​కి సంబంధం లేకపోయినా కామెంట్స్​ సెక్షన్స్​లో అతడిపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఊర్వశితో పంత్​ రిలేషన్​పై కొంతకాలంగా కాంట్రవర్సీ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నారని గొడవల కారణంగా విడిపోయారనే రూమర్​ బయటకు వచ్చింది.

rvasi and rishab pant
rvasi and rishab pant

త్రిష సక్సెస్​ సీక్రెట్​ అదేనట

Trisha
Trisha

సౌత్​లో సీనియర్​ బ్యూటీల హవా తగ్గుతున్న వేళ త్రిష మాత్రం తన దూకుడు చూపిస్తోంది. కుర్ర హీరోయన్లకు సైతం పోటినిచ్చేలా తనను తాను మలుచుకుని బడా ఆఫర్లు కొట్టేస్తోంది. ఇటీవల విజయ్​తో కలిసి ఆమె నటించిన ‘లియో’ సినిమా బ్లాక్​బస్టర్​ టాక్​ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ జోడీ తెరపై కనిపించడంతో ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు. అయితే, ఇన్నేళ్లైనా త్రిష హీరోయిన్ల రేసులో వెనకబడకపోవడానికి గల కారణాలను తాజాగా చెప్పింది. యాక్టర్స్​ అంటేనే కేరీర్​లో అప్​ అండ్​ డౌన్స్​ కచ్చితంగా ఉంటాయి. వాటన్నింటినీ సమానంగా తీసుకుని ముందుకెళ్లాలి. నేను దీనిని ఫాలో అవ్వడం వల్లే ఈరోజు నా స్థానాన్ని నిలబెట్టుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చిందీ చెన్నై బ్యూటీ.

 

స్వర్గం– నరకం నటుడు ఇకలేరు

Actor eshwar rao
Actor Eshwar Rao

Cinema: ప్రముఖ తెలుగు సీనియర్​ నటుడు ఈశ్వర్​రావు కన్నుమూశారు. గత నెల 31న ఆయన మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలో తన కుమార్తె వద్ద ఉంటున్న ఆయన అనారోగ్యంతో మరణించినట్టు తెలుస్తోంది. స్వర్గం– నరకం సినిమాతో మోహన్​ బాబుతో పాటు పరిశ్రమకు పరిచయమైన నటుల్లో ఈశ్వర్​రావు ఒకరు. బొమ్మరిల్లు, కన్నవారి ఇల్లు, తల్లి దీవెన తదితర సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. పలు టీవీ సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన మృతిపై చిత్రపరిశ్రమ దిగ్భాంతి వ్యక్తం చేసింది.

రిపోర్టుల్లో నార్మల్​.. అయినా గుండెపోటు

Sushmita Sen
Sushmita Sen

ముంబై: బాలీవుడ్ నటి సుస్మితా సేన్​ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైద్యులు ఆమెకు స్టంట్​ వేశారు. ప్రస్తుతం పలు వెబ్​ సిరీస్​లు​, సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీలో గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో తాను ప్రతి ఆరు నెలలకోసారి పరీక్షలు చేయించుకుంటానని తెలిపింది. కానీ, తనకు గుండెపోటు రావడానికి ముందు కూడా ఇలాగే పరీక్షలు చేయించినట్టు తెలిపింది. ఆ రిపోర్టుల్లో అంతా నార్మల్​గానే ఉందని కానీ, తనకు ఇలా జరగడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

 

 

 

 

అర్ధనగ్నంగా రోడ్డుపైకి.. నటి అరెస్ట్

Cinema actor urfi arrest
Cinema actor urfi arrest

ముంబై​: బాలీవుడ్​ నటి ఉర్ఫీ జావేద్​కు ముంబై పోలీసులు షాకిచ్చారు. ఇవాళ ఉదయం కాఫీ కోసం బయటకు వచ్చిన ఆమెను కొందరు మహిళా పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యతో ఉర్ఫీ కంగుతిన్నది. ఏ కారణంతో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆమె పోలీసులను కోరింది. తనకు మాట్లాడే చాన్స్​ కూడా ఇవ్వకుండా వారు ఆమెను వ్యానెక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఈ సమయంలో ఆమె తన బ్యాక్ పూర్తిగా కనిపించేలా బట్టలు ధరించింది. ఉర్ఫీ అరెస్టుకు ఇదే కారణమా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలోనూ ఆమె వింత వస్త్రధారణతో ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చారు. మరి ఈ అరెస్టు ఏ విషయంలో అనేది తెలియాల్సి ఉంది.

 

Also Read: