నిఖార్సయిన ఆర్థిక క్రమశిక్షణకు చిరునామా దివంగత సీఎం రోశయ్య (CM Roshaiah) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన రోశయ్య వర్ధింతి సభలో సీఎం మాట్లాడుతూ.. ఆయన విగ్రహం హైదరాబాద్ లో లేకపోవడం తీవ్రమైన లోటన్నారు. ఆర్యవైశ్యులు సరైన స్థలాన్ని ఎంపిక చేస్తే నాలుగో వర్ధంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఆ ప్రాంతాన్ని రోశయ్య పేరుతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆయన 16 ఏండ్ల పాటు రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా సేవలందించారని కొనియాడారు. ఆయన చొరవతోనే తెలంగాణ 16వేల కోట్ల మిగులు రాష్ట్రంగా ఉండిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాలని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని రోశయ్య చెప్పేవారని అన్నారు. రోశయ్య ఆర్థిక మంత్రిగ ఉండటం వల్ల అనేక మంది వైఎస్ఆర్ పని ఈజీ అయ్యిందన్నారు.
ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ రోశయ్య నంబర్ 2 గా ఉండాలని కోరుకునే వారని గుర్తు చేశారు. రోశయ్య వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఒక స్ఫూర్తి అని అన్నారు. రోశయ్య తనకు సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. వాసవి విద్యా సంస్థలను నిలబెట్టేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని చెప్పారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

నిఖార్సయిన ఆర్థిక క్రమశిక్షణకు చిరునామా దివంగత సీఎం రోశయ్య (CM Roshaiah) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన రోశయ్య వర్ధింతి సభలో సీఎం మాట్లాడుతూ.. ఆయన విగ్రహం హైదరాబాద్ లో లేకపోవడం తీవ్రమైన లోటన్నారు. ఆర్యవైశ్యులు సరైన స్థలాన్ని ఎంపిక చేస్తే నాలుగో వర్ధంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఆ ప్రాంతాన్ని రోశయ్య పేరుతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆయన 16 ఏండ్ల పాటు రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా సేవలందించారని కొనియాడారు. ఆయన చొరవతోనే తెలంగాణ 16వేల కోట్ల మిగులు రాష్ట్రంగా ఉండిందన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాలని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని రోశయ్య చెప్పేవారని అన్నారు. రోశయ్య ఆర్థిక మంత్రిగ ఉండటం వల్ల అనేక మంది వైఎస్ఆర్ పని ఈజీ అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ రోశయ్య నంబర్ 2 గా ఉండాలని కోరుకునే వారని గుర్తు చేశారు. రోశయ్య వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఒక స్ఫూర్తి అని అన్నారు. రోశయ్య తనకు సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. వాసవి విద్యా సంస్థలను నిలబెట్టేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని చెప్పారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Alsdo read:

