మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసు కొట్టి వేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలతో తనకు సంబంధం లేని కేసులో ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నారు.సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఈ నెల 1న హరీశ్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అభియోగంపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారించి.. పిటిషనర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత హరీశ్ రావుపై, రాధాకిషన్ రావుపై కేసులు నమోదు చేశారు. హరీశ్ రావు క్వాష్ పిటిషన్ (Quash Petition) పై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసు కొట్టి వేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలతో తనకు సంబంధం లేని కేసులో ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నారు.సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఈ నెల 1న హరీశ్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అభియోగంపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారించి.. పిటిషనర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత హరీశ్ రావుపై, రాధాకిషన్ రావుపై కేసులు నమోదు చేశారు. హరీశ్ రావు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also read:
- Patnam Narender Reddy: పట్నంకు హైకోర్టులో చుక్కెదురు
- Golden Temple: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు

