కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదైన వేళ మరో శుభవార్త అందింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన (Google) గూగుల్ సంస్థ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో స్థాపించేందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఆసియా పసిఫిక్ రీజియన్ రెండు, ప్రపంచంలో ఐదో పెద్ద సెంటర్ గా అవతరించనుంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. కాగా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ గత ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అమెరికాలో పర్యటించారు. అక్కడ గూగుల్ (Google) కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక సమావేశాలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదైన వేళ మరో శుభవార్త అందింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్ సంస్థ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో స్థాపించేందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఆసియా పసిఫిక్ రీజియన్ రెండు, ప్రపంచంలో ఐదో పెద్ద సెంటర్ గా అవతరించనుంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. కాగా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ గత ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అమెరికాలో పర్యటించారు. అక్కడ గూగుల్ కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక సమావేశాలు నిర్వహించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తమ రాష్ట్రం అందిస్తున్న సదుపాయాలపై వివరించారు. అనంతరం భారత్ లో తమ సంస్థకు సంబంధించిన బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది గూగుల్. తమ రాష్ట్రంలో ఆ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఎన్నో రాష్ట్రాలు పోటీపడినప్పటికీ.. రాష్ట్ర సర్కారు అందిస్తున్న సదుపాయలతో సంతృప్తి చెందిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో తమ సంస్థను స్థాపించేందుకు మొగ్గుచూపారు. ఈమేరకు గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రత, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
Also read:

