మాజీ మంత్రి హరీశ్ రావును విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌వద్ద ధర్నాకు దిగారు. ఎమ్మెల్సీ కవిత(Kavitha ), పలువురు మాజీ మంత్రులు అక్కడికి చేరుకుని ఆయన్ను హరీశ్‌ను పరామర్శించారు. ఈక్రమంలో ఆందోళనకు దిగిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇంటి వద్ద హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు హరీశ్ రావు, పాడి కౌశిక్‌రెడ్డిల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది.

రేపు(శుక్రవారం) ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టనుంది. ఈ ధరన్నాలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు.
Also read :
Pslv-C59 : పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం సక్సెస్
Akunuri Murali : కేసీఆర్‌నే తప్పు పడుతా!

