నగర వాసులకు ఇష్టమైన ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ తాము పుష్ప–2 (Pushpa-2)సినిమాను ప్రదర్శించడం లేదని ప్రకటించింది.
ఇవాళ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం.
దురదృష్టవశాత్తూ, కొన్ని అనివార్య కారణాల వల్ల ‘పుష్ప 2’(Pushpa-2_ను మీకెంతో ఇష్టమైన ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించలేకపోతున్నాం.
మీకు అసౌకర్యం కల్పించినందుకు మేము చింతిస్తున్నాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది.
‘పుష్ప 2’ (Pushpa-2)చిత్రాన్ని ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
Also read :
Kavitha : గచ్చిబౌలి పీఎస్‌కు ఎమ్మెల్సీ కవిత
Pslv-C59 : పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం సక్సెస్

