(Telangana MP) రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహించిన చెకింగ్స్‌లో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కనిపించింది. దీంతో రాజ్యసభ చైర్మన్ ధనఖడ్ విచారణకు ఆదేశించారు. అయితే (Telangana MP) తెలంగాణ నుంచి ఎన్నికైన సింఘ్వీ పేరును చైర్మన్ ప్రస్తావించడంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.

దీంతో ఆ పార్టీ ఎంపీల ఆందోళనతో సభలో గందరగోళం చెలరేగింది. మరోవైపు రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.
ఇలాంటిది నేనెన్నడూ చూడలేదు: సింఘ్వీ
మరోవైపు, ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ స్పందించారు. తాను కేవలం ఒకేఒక్క రూ.500 నోటు తీసుకొచ్చానని తెలిపారు.
ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక రూ.500 నోటు మాత్రమే ఉంది. నిన్న మధ్యాహ్నం 12.57 గంటలకు సభ లోపలికి వచ్చా. ఒంటి గంటకు సభ వాయిదా పడటంతో క్యాంటీన్‌కు వెళ్లా. మధ్యాహ్నం 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయా’ అని సింఘ్వీ క్లారిటీ ఇచ్చారు.
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహించిన చెకింగ్స్‌లో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కనిపించింది. దీంతో రాజ్యసభ చైర్మన్ ధనఖడ్ విచారణకు ఆదేశించారు.
అయితే (Telangana MP) తెలంగాణ నుంచి ఎన్నికైన సింఘ్వీ పేరును చైర్మన్ ప్రస్తావించడంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
దీంతో ఆ పార్టీ ఎంపీల ఆందోళనతో సభలో గందరగోళం చెలరేగింది. మరోవైపు రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.
Also read:

