Yadadri Bhuvanagiri: కల్లు తాగేందుకు వెళ్లి ఐదుగురి జలసమాధి

Yadadri Bhuvanagiri

యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద కారు కంట్రోల్​ తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరి కండీషన్​ సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీ నుంచి భూదాన్​పోచంపల్లిలో కల్లు తాగడానికి పొద్దున్న కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జలాల్​పూర్​ వద్ద రోడ్డు మలుపు ఉండటంతో కారును కంట్రోల్​ చేయలేక డ్రైవర్​వంశీ సడన్​బ్రేక్​కొట్టాడు.

Telangana: 5 killed after car plunges into lake, cops suspect drunk driving  | Latest News India - Hindustan Timesదీంతో ఓవర్​స్పీడ్​తో దూసుకువచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న చెరువులో మునగడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన టైంలో ఆరుగురు యువకులు ఉండగా.. అందులో నుంచి మణికంఠ అరు వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సేఫ్​గా ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వారి డెడ్​బాడీలను వెలికితీశారు. మృతులను ఎల్బీనగర్​లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష (21), దినేశ్ (21) , వంశీ (23), బాలు (19), వినయ్(21)గా గుర్తించారు.

చెరువులోకి దూసుకెళ్లిన కారు - ఐదుగురు యువకులు మృతిడెడ్​బాడీలను భువనగిరి గవర్నమెంట్​ హాస్పిటల్​కి తరలించారు. సిటీ నుంచి భూదాన్​ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసు లోపు వారే. ఈ ఘటనపై భూదాన్​ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలి వద్ద జలాల్​పూర్​ గ్రామస్థుల నిరసనకు దిగారు. డేంజర్​గా ఉన్న మలుపు వద్ద సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ఆందోళనలతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది.

Car Plunged into Lake: காலையிலேயே போதை? அதிவேகம்.. கார் ஏரியில் பாய்ந்து 5  இளைஞர்கள் பலி.. நெஞ்சை பதறவைக்கும் சம்பவம்.! | 📰 LatestLY தமிழ்

యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద కారు కంట్రోల్​ తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరి కండీషన్​ సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది.ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీ నుంచి భూదాన్​పోచంపల్లిలో కల్లు తాగడానికి పొద్దున్న కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జలాల్​పూర్​ వద్ద రోడ్డు మలుపు ఉండటంతో కారును కంట్రోల్​ చేయలేక డ్రైవర్​వంశీ సడన్​బ్రేక్​కొట్టాడు.

Also read: