ఇందిరమ్మ ఇండ్ల (Indiramma’s house) నిర్మాణంపై సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించనున్నారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లక సంబంధించిన యాప్ ను విడుదల చేశారు. ఇంటి మోడల్ ను కూడా విడుదల చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మెుత్తంగా 4 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రతి 500 ఇండ్లకు ఒక సర్వేయర్‌ను కేటాయించి.. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి ప్రతి రోజు కనీసం 25 ఇండ్ల చొప్పున సర్వే చేయనున్నారు. సర్వే నిర్వహించే ప్రాంతాలలో ఒక రోజు ముందుగా ప్రజలందరికీ తెలిసేలా డప్పు చాటింపు వేస్తారు. ప్రత్యేక యాప్ వినియోగంపై సర్వేయర్లకు శిక్షణ ఇస్తారు.

Also read: