అతి త్వరలోనే రేషన్‌షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (UttamKumar) అన్నారు. రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని ఆయకట్టుకు విడుదల చేశారు. ఈసందర్భంగా (UttamKumar) మంత్రి మాట్లాడుతూ ‘ఐదేండ్లపాటు కచ్చితంగా రైతులకు బోనస్ ఇస్తం. సైంటిస్టులు సూచినట్లుగా తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ రకాలు వేస్తే దిగుబడి మంచిగా వచ్చే అవకాశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పనులకు ప్రియారిటీ ఇస్తున్నం. గత ప్రభుత్వం పదేండ్లడ్ల పాటు లక్ష 81 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశారు. కానీ పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నుంచి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు చేశారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్‌లు కూలిపోయాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండానే వానాకాలం సీజన్లో స్టేట్ లో రికార్డు స్థాయి లో పంటలు సాగు అయ్యాయి. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులూ ఉన్న హామీలను అమలు చేస్తున్నం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నం’ అని తెలిపారు.
అతి త్వరలోనే రేషన్‌షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని ఆయకట్టుకు విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఐదేండ్లపాటు కచ్చితంగా రైతులకు బోనస్ ఇస్తం. సైంటిస్టులు సూచినట్లుగా తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ రకాలు వేస్తే దిగుబడి మంచిగా వచ్చే అవకాశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పనులకు ప్రియారిటీ ఇస్తున్నం. గత ప్రభుత్వం పదేండ్లడ్ల పాటు లక్ష 81 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశారు. కానీ పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నుంచి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు చేశారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్‌లు కూలిపోయాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండానే వానాకాలం సీజన్లో స్టేట్ లో రికార్డు స్థాయి లో పంటలు సాగు అయ్యాయి. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులూ ఉన్న హామీలను అమలు చేస్తున్నం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నం’ అని తెలిపారు.
Also read:

