మాదిగలకు న్యాయం చేస్తామని, ఆ బాధ్యత తానే తీసుకుంటానని (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ గారి నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వారం రోజుల్లో వస్తుందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం నియమించామని వివరించారు. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డాక్టర్ సంగీతను నియమించుకున్నామని, ఓయూ వీసీగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించామని సీఎం వివరించారు. తన రాజకీయ ప్రస్థానంలో మాదిగలకు ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు.

Also read: