కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లతో ఢిల్లీ చలో మార్చ్ నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ (Shambhu border) ప్రయోగించారు. వాటర్ కానాన్లతో నిరసన కారులను చెదరగొట్టారు. ఈ సంఘటన ఢిల్లీ–హరియానా సరిహద్దులోని (Shambhu) శంభు బార్డర్ వద్ద చోటు చేసుకుంది. టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని దవాఖాన లకు తరలించారు. 101 మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి రైఊతులు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి తమ నిరసన గళం వినిపించేందుకు యత్నిస్తున్నారు. ఈ రోజుతో కలిపి మూడో సారి పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఢిల్లీ చలో పిలుపు నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం గమనార్హం. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లతో ఢిల్లీ చలో మార్చ్ నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ కానాన్లతో నిరసన కారులను చెదరగొట్టారు. ఈ సంఘటన ఢిల్లీ–హరియానా సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద చోటు చేసుకుంది. టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో, వారిని దవాఖాన లకు తరలించారు. 101 మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి రైఊతులు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి తమ నిరసన గళం వినిపించేందుకు యత్నిస్తున్నారు. ఈ రోజుతో కలిపి మూడో సారి పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఢిల్లీ చలో పిలుపు నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం గమనార్హం. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
Also read:

