Mohan Babu: ఆస్పత్రికి మోహన్ బాబు.. కారణం ఇదే!

Mohan Babu

క్షమించండి తప్పు నాదే జర్నలిస్ట్ పై దాడి ఘటనలో సినీ నటుడు (Mohan Babu) మోహన్ బాబు తన తప్పును అంగీకరించారు. బాధిత జర్నలిస్ట్ రంజిత్, అతని కుటుంబ సభ్యులకు స్వయంగా క్షమాపణలు చెప్పారు. జల్పల్లి లోని తన నివాసం వద్ద తాను చేసిన దాడిలో గాయపడి ఆసుపత్రి పాలైన జర్నలిస్ట్ రంజిత్ ను మోహన్ బాబు ఆదివారం పరామర్శించారు. (Mohan Babu) తన కుమారుడు మంచు విష్ణు తో కలిసి సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన… బాధిత జర్నలిస్టుకు క్షమాపణ చెప్పారు. రంజిత్ కుమార్తె. ఇతర కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు. ఆరోజు జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నానని అలా జరిగి ఉండాల్సింది కాదని, తప్పు తనదేనని రంజిత్ తో అన్నారు.

క్షమించమని అడగడం తప్ప… ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని రంజిత్, అతని భార్య పిల్లలకు వివరణ ఇచ్చుకున్నారు. అలాగే, రంజిత్ కుమార్తెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఎత్తుకున్నారు. సారీ తల్లి నా వల్లే మీ నాన్నకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ చిన్నారితో అన్నారు. అనంతరం, రంజిత్ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి… రంజిత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రెండు కాళ్లు భుజాలు కాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకున్న తనకు… బాధ ఎలా ఉంటుందో తెలుసునని ఈ సందర్భంగా వారితో అన్నారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అండగా ఉంటానని, ఏ సాయం చేయడానికి అయినా సిద్ధమని హామీ ఇచ్చారు.

Image

జర్నలిస్ట్ పై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు తన తప్పును అంగీకరించారు. బాధిత జర్నలిస్ట్ రంజిత్, అతని కుటుంబ సభ్యులకు స్వయంగా క్షమాపణలు చెప్పారు. జల్పల్లి లోని తన నివాసం వద్ద తాను చేసిన దాడిలో గాయపడి ఆసుపత్రి పాలైన జర్నలిస్ట్ రంజిత్ ను మోహన్ బాబు ఆదివారం పరామర్శించారు. తన కుమారుడు మంచు విష్ణు తో కలిసి సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన… బాధిత జర్నలిస్టుకు క్షమాపణ చెప్పారు. రంజిత్ కుమార్తె. ఇతర కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు. ఆరోజు జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నానని అలా జరిగి ఉండాల్సింది కాదని, తప్పు తనదేనని రంజిత్ తో అన్నారు.

Also read: