Mahesh goud: వాళ్ల త్యాగం మరువలేనిది

1971లో(Mahesh goud) జరిగిన యుద్దంలో దేశ చరిత్రలో లిఖించదగిన విధంగా పాకిస్తాన్​పై ఇండియా విజయం సాధించిందని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​ గౌడ్(Mahesh goud)​ అన్నారు. ఈ యుద్దంతో బంగ్లాదేశ్​కు విముక్తి లభించిందన్నారు. ఈ విజయానికి గుర్తుగా దేశంలో ప్రతి ఏటా విజయ్​దివస్​గా జరుపుకోవడం సంతోషకరమన్నారు. విజయ్​ దివస్​ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇవాళ గాంధీభవన్​వద్ద జెండాను ఆవిష్కరించారు. అమర సైనికులకు నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాటి తూర్పు పాకిస్థాన్​ ( నేటి బంగ్లాదేశ్​) పరిస్థితిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ధైర్యంగా చక్కదిద్దారన్నారు. 1971లో జరిగిన చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేదన్నారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయన్నారు. బంగ్లాదేశ్​లో భారతీయులపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఈ యుద్దంతో బంగ్లాదేశ్​కు విముక్తి లభించిందన్నారు. ఈ విజయానికి గుర్తుగా దేశంలో ప్రతి ఏటా విజయ్​దివస్​గా జరుపుకోవడం సంతోషకరమన్నారు. విజయ్​ దివస్​ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇవాళ గాంధీభవన్​వద్ద జెండాను ఆవిష్కరించారు. అమర సైనికులకు నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాటి తూర్పు పాకిస్థాన్​ ( నేటి బంగ్లాదేశ్​) పరిస్థితిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ధైర్యంగా చక్కదిద్దారన్నారు. 1971లో జరిగిన చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేదన్నారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయన్నారు. బంగ్లాదేశ్​లో భారతీయులపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Also Read :