శాసన సభ సమావేశాల్లో మూడో రోజైన మంగళవారం డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) భట్టి విక్రమార్క, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోహన్ ఇవ్వడమే ఇందుకు కారణమైంది. ఆర్థిక మంత్రి భట్టి అప్పులపై సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాను కరెక్టుగానే చెప్పానని భట్టి అన్నారు. గత సర్కారు బిల్లులను పెండింగ్ లో పెట్టిందని, వాటిని తామే చెల్లిస్తున్నామని చెప్పారు. వాళ్లు చేసిన అప్పులకు వడ్డీల కిందే 65 వేల కోట్లను కట్టామని అన్నారు. దీనిపై అటు హరీశ్ రావు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఎఫ్ఆర్ఎంపీ కింద చేసిన అప్పులు కాకుండా కార్పొరేషన్ల పేరుతో కూడా తీసుకున్నారని, మొత్తం ఈ ఏడాది తీసుకున్నది రూ. 1,27,208 కోట్లు అని చెప్పారు.

నల్ల డ్రస్ లతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుపు రంగు దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ బేడీలు వేసుకొని సభకు వచ్చారు. ఈ సందర్భంగా కొద్ది సేపు గందరగోళం నెలకొంది. తర్వాత హ్యాండ్ కఫ్స్ తీసేసి వారి వారి స్థానాల్లో కూర్చున్నారు.

శాసన సభ సమావేశాల్లో మూడో రోజైన మంగళవారం డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) భట్టి విక్రమార్క, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోహన్ ఇవ్వడమే ఇందుకు కారణమైంది. ఆర్థిక మంత్రి భట్టి అప్పులపై సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాను కరెక్టుగానే చెప్పానని భట్టి అన్నారు. గత సర్కారు బిల్లులను పెండింగ్ లో పెట్టిందని, వాటిని తామే చెల్లిస్తున్నామని చెప్పారు.
వాళ్లు చేసిన అప్పులకు వడ్డీల కిందే 65 వేల కోట్లను కట్టామని అన్నారు. దీనిపై అటు హరీశ్ రావు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఎఫ్ఆర్ఎంపీ కింద చేసిన అప్పులు కాకుండా కార్పొరేషన్ల పేరుతో కూడా తీసుకున్నారని, మొత్తం ఈ ఏడాది తీసుకున్నది రూ. 1,27,208 కోట్లు అని చెప్పారు.
Also read:

