Revanth Reddy:మేడ్చల్ కు ఐటీ పార్కు ఎటువాయె

Medchal:మేడ్చల్ కు ఐటీ పార్కు ఎటువాయె

కేసీఆర్, మల్లారెడ్డి కలిసి భూములు కబ్జా పెట్టిండ్రు
= తెలంగాణలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేదు
= జవహర్ నగర్, మేడ్చల్ సభల్లో పీసీసీ చీఫ్(Revanth Reddy) రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జవహర్ న గర్ కు డంపింగ్ యార్డు మాత్రమే తీసుకొచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. మేడ్చల్ పట్టణానికి తెస్తానన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇవాళ జవహర్ నగర్, మేడ్చల్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్, మల్లారెడ్డిలు కలిసి మేడ్చల్ లో భూములను కబ్జా చేస్తున్నారని రేవంత్ (Revanth Reddy)ఆరోపించారు. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2వేల 5 వందలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఉండేదని.. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి దానిని 12 వందల రూపాయలు చేశారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదల ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి రూ.లక్ష నగదు తోపాటు తులం బంగారం కూడా ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ జవహర్ న గర్ కు డంపింగ్ యార్డు మాత్రమే తీసుకొచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. మేడ్చల్ పట్టణానికి తెస్తానన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇవాళ జవహర్ నగర్, మేడ్చల్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్, మల్లారెడ్డిలు కలిసి మేడ్చల్ లో భూములను కబ్జా చేస్తున్నారని రేవంత్ (Revanth Reddy)ఆరోపించారు.

Read More: