ప్రముఖ తబలా కళాకారుడు ఉస్తాద్ (Zakir Hussain) జాకీర్ హుస్సేన్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్తులెంత..? అనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఆరు దశాబ్దాల కెరీర్ లో (Zakir Hussain) జాకీర్ ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. జాకీర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 8.48 కోట్లు. అతడు ఒక కచేరీకి 5 -10 లక్షలు అందుకునే వారని తెలుస్తోంది. ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖాకు పెద్ద కుమారుడు జాకీర్.
తన తండ్రి ప్రేరణతో ఏడు సంవత్సరాల వయస్సులో తబలా నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడు 12 సంవత్సరాల వయస్సులో భారతదేశం అంతటా ప్రదర్శన ఇచ్చాడు. సెయింట్ మైఖేల్స్ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి, సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. హుస్సేన్ కథక్ నర్తకి , ఉపాధ్యాయురాలు అయిన ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నాడు. వారికి అనిసా, ఇసాబెల్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంగీతంతో పాటు సినిమాల్లో అతిథిగా కొన్నిసార్లు కనిపించాడు.
ప్రముఖ తబలా కళాకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్తులెంత..? అనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఆరు దశాబ్దాల కెరీర్ లో జాకీర్ ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. జాకీర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 8.48 కోట్లు. అతడు ఒక కచేరీకి 5 -10 లక్షలు అందుకునే వారని తెలుస్తోంది. ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖాకు పెద్ద కుమారుడు జాకీర్. తన తండ్రి ప్రేరణతో ఏడు సంవత్సరాల వయస్సులో తబలా నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడు 12 సంవత్సరాల వయస్సులో భారతదేశం అంతటా ప్రదర్శన ఇచ్చాడు. సెయింట్ మైఖేల్స్ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి, సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. హుస్సేన్ కథక్ నర్తకి , ఉపాధ్యాయురాలు అయిన ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నాడు. వారికి అనిసా, ఇసాబెల్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంగీతంతో పాటు సినిమాల్లో అతిథిగా కొన్నిసార్లు కనిపించాడు.
Also read:

