Amit Shah: అమిత్ షాను బర్తరఫ్​ చేయాలి

Amit Shah

కేంద్ర మంత్రి వర్గం నుంచి (Amit Shah) అమిత్ షాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా (Amit Shah) అమిత్ షాకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవన్ ప్రాంగణంలో జై భీమ్ నినాదంతో హోరెత్తించారు. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తోపాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. వారిని మార్షల్స్ నిలువరించారు. అనంతరం పార్లమెంటు భవన్ ముందు ఆందోళన కొనసాగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. వారు ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు.

Image

కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షాకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవన్ ప్రాంగణంలో జై భీమ్ నినాదంతో హోరెత్తించారు. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తోపాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. వారిని మార్షల్స్ నిలువరించారు. అనంతరం పార్లమెంటు భవన్ ముందు ఆందోళన కొనసాగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. వారు ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు.

పార్లమెంటు వద్ద తోపులాట
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ పార్లమెంటు వద్ద జై భీమ్, ఐయామ్ అంబేద్కర్ ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. అదే సమయంలో పార్లమెంటుకు వచ్చిన బీజేపీ ఎంపీలు ప్రతిగా నినాదాలు చేశారు. వారిని సభలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు.. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి కింద పడ్డాడు. ఆయన తలకు గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు.

Image

Also read: