అయోధ్య (Ayodhya) రామాలయం సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ గా అయోధ్య నిలిచినట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ పర్యాటక రంగంలో టాప్ ఉండేదని.. ఇప్పుడు దాని రికార్డ్ ను అయోధ్య(Ayodhya) బద్ధలు కొట్టిందని తెలిపింది. ఈ మేరకు యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ వివరాలు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 3153 మంది విదేశీ టూరిస్టులు అయోధ్యను సందర్శించారు. కానీ తాజ్ మహల్ ను మాత్రం 12.51 కోట్ల మంది మాత్రమే సందర్శించారని వెల్లడించారు.
Also read :
KTR : ఫార్ములా –ఈ కేసు లోకి ఈడీ
Amit Shah: అమిత్ షాను బర్తరఫ్ చేయాలి

