ఫార్ములా ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ను ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్ (KTR ) కు పది రోజుల పాటు ఊరట లభించింది. ఈ మేరకు ఇవాళ జస్టిస్ శ్రవణ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కేటీఆర్ (KTR ) తరఫున సీనియర్ అడ్వొకేట్ సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేటీఆర్ (KTR )పై కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కౌంటర్ ఏసీబీ తరఫున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందన్నారు. విచారణకు గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారని చెప్పారు. నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇవాళే క్వాష్ పిటిషన్ నమోదు చేయడం సరికాదని అన్నారు. అగ్రిమెంట్ లేఊకుండా కేటీఆర్(KTR ) ఆదేశాలతోనే నగదు బదిలీ అయ్యిందని వివరించారు. ఇరు వర్గాల వాదనలు నమోద చేసుకున్న ధర్మాసనం ఈ నెల 30 లోపు కౌంటర్ వేయాలని సూచించారు. అప్పటి వరకు కేటీఆర్ (KTR )ను అరెస్టు చేయవద్దని సూచించారు.
Also read :
KTR : ఫార్ములా –ఈ కేసు లోకి ఈడీ

