Transgenders: ట్రాన్స్ జెండర్స్ ట్రాఫిక్ డ్యూటీ

ట్రాన్స్ జెండర్లు(Transgenders) రేపటి నుంచి ట్రాఫిక్ విధులు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ట్రాన్స్ జెండర్ నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించి 39 మందిని ఎంపిక చేసినట్టు సీపీ తెలిపారు.వారికి(Transgenders) 15 రోజులపాటు శిక్షణ ఇచ్చి హైదరాబాద్లోని రద్దీగల కూడళ్ల లో ట్రాఫిక్ నియంత్రణ కోసం వినియోగించేందుకు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు వాళ్లు డిసెంబర్ 23వ తేదీ నుంచి ట్రాఫిక్ విధుల్లో అందుబాటులో ఉంటారు. వీళ్లకు హోంగార్డు స్థాయి వేతనాలు అందించేందుకు ప్రభుత్వం ఇది వరకే అంగీకరించిన విషయం తెలిసిందే.

Also Read :