PV: పీవీ.. తెలంగాణ ఠీవీ

PV

భారతరత్న, మాజీ ప్రధాని (PV) పీవీ నర్సింహారావు దేశానికి విశేషమైన సేవలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక రకాల సంస్కరణలు చేసిన మన తెలుగు బిడ్డ పీవీ అని గుర్తుచేశారు. నెక్లస్​రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. మారుమూల గ్రామాల్లోని జన్మించి ఈ రాష్ట్రంలో అనేక పదవులు నిర్వహించారని.. అనేక భాషల్లో మంచి పట్టు ఉన్న రాజకీయ నాయకుడు అని కొనియాడారు. దేశ ప్రధానిగా పనిచేసిన ఏకైక తెలుగు బిడ్డ ఆయనే అని అన్నారు. ‘రాజకీయాలు వేరు అయినప్పటికీ మనం దేశం కోసం పనిచేస్తున్నమన్న భావన పీవీది’ (PV) అని కేంద్ర ప్రభుత్వం తరపున వారికి ఘన నివాళి అర్పించారు.

Image

ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ప్రముఖులు పీవీ జ్ఞానభూమి వద్ద ప్రముఖులు అంజలి ఘటించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, మాజీలు ఎంపీలు కేశవరావు, కేవీపీ రామచంద్ర రావు, ఎమ్మెల్సీలు వాణీదేవి, బండ ప్రకాశ్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, తలసాని శ్రీనివాస్​యాదవ్ మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. టీపీసీసీ చీఫ్​మహేశ్వర్​కుమార్​గౌడ్,
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు పీవీ దేశానికి సేవలను గుర్తుచేసుకున్నారు,

Image

పీవీ దార్శనికుడు: సీఎం రేవంత్​

బహుభాషాకోవిదుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సరళీకృత ఆర్థిక విధానాలతో సంస్కరణలకు బీజం వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన దార్శనికుడని గుర్తుచేశారు. సంక్షోభం నుంచి సమున్నత శిఖరాలకు భారత ప్రస్థానానికి బాటలు వేసిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని కొనియాడారు.

Also read: