KCR: కేసీఆర్, హరీశ్ కు హైకోర్టులో ఊరట

KCR

మాజీ సీఎం (KCR) కేసీఆర్, మాజీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ కుంగుబాటు కేసులో విచారణకు రావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ (KCR) కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో నిన్న క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు హరిరామ్‌, శ్రీధర్‌, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్‌ సహా ఇతరులు కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. తమకు పరిధి లేదని పేర్కొంటూ మేజిస్ట్రేట్‌ కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టేసింది. రాజలింగం రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా నోటీసులు జారీ చేసింది. రివిజన్‌ పిటిషన్‌ను స్వీకరించే అధికార పరిధి భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని, దాన్ని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారించిన కోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Image

మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ కుంగుబాటు కేసులో విచారణకు రావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో నిన్న క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు హరిరామ్‌, శ్రీధర్‌, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్‌ సహా ఇతరులు కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. తమకు పరిధి లేదని పేర్కొంటూ మేజిస్ట్రేట్‌ కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టేసింది. రాజలింగం రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా నోటీసులు జారీ చేసింది. రివిజన్‌ పిటిషన్‌ను స్వీకరించే అధికార పరిధి భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని, దాన్ని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారించిన కోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Image

Also read: