రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నినాదంతో ప్రజాపాలన కొనసాగుతుందని, ఆరుకాలం శ్రమించి కష్టపడి పంటలు పండించిన నిజమైన లబ్ధిదారులకు రైతుబంధు ఇస్తామని మంత్రి (Sitakka) సీతక్క స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఇప్పటివరకు ఠూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. ఇవాళ ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏలూరునాగారం మండలాల్లో ఆమె పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గతంలో రెన్యువల్ చేసుకోకపోవడంతో కొంతమందికి రుణమాఫీ జరగలేదని, గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదాలను సమీక్షించి రుణమాఫీ కానీ జాబితాను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు విషయంలో గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, వేల ఎకరాలు బీడు, పడావు భూములకు రైతుబంధు ఇచ్చి పట్టా పాస్ పుస్తకాలు లేవనే సాకుతో సాగులో ఉన్న భూములకు రైతుబంధు ఇవ్వని దుస్థితి నెలకొందని విమర్శించారు.‘

ఎకరం భూమి కూడా లేని నిజమైన పేదలకు గత పదేండ్లలో లబ్ధి చేకూరాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారికి మేలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. రైతులకు ఫ్రీ కరెంట్ హామీ ఇచ్చినట్టుగా ఠూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నం. సన్నవడ్లు పండించిన రైతులు సంతోషంగా ఉన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యోగాల భర్తీ చేస్తం. పేదింటి బిడ్డలకు కూడా ఇండ్లు మంజూరు చేస్తం. ’ అని సీతక్క (Sitakka) అన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ మహేందర్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవీ చందర్ ఉన్నారు.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నినాదంతో ప్రజాపాలన కొనసాగుతుందని, ఆరుకాలం శ్రమించి కష్టపడి పంటలు పండించిన నిజమైన లబ్ధిదారులకు రైతుబంధు ఇస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఇప్పటివరకు ఠూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. ఇవాళ ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏలూరునాగారం మండలాల్లో ఆమె పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గతంలో రెన్యువల్ చేసుకోకపోవడంతో కొంతమందికి రుణమాఫీ జరగలేదని, గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదాలను సమీక్షించి రుణమాఫీ కానీ జాబితాను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

రైతుబంధు విషయంలో గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, వేల ఎకరాలు బీడు, పడావు భూములకు రైతుబంధు ఇచ్చి పట్టా పాస్ పుస్తకాలు లేవనే సాకుతో సాగులో ఉన్న భూములకు రైతుబంధు ఇవ్వని దుస్థితి నెలకొందని విమర్శించారు.‘ ఎకరం భూమి కూడా లేని నిజమైన పేదలకు గత పదేండ్లలో లబ్ధి చేకూరాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారికి మేలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. రైతులకు ఫ్రీ కరెంట్ హామీ ఇచ్చినట్టుగా ఠూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నం. సన్నవడ్లు పండించిన రైతులు సంతోషంగా ఉన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యోగాల భర్తీ చేస్తం. పేదింటి బిడ్డలకు కూడా ఇండ్లు మంజూరు చేస్తం.
Also read:

