Christmas: మెదక్ చర్చిలో క్రిస్మస్

Christmas

ఆసియాలోనే రెండో పెద్దదైన మెదక్‌ చర్చిలో శతాబ్ది క్రిస్మస్‌ (Christmas)సెలబ్రేషన్లు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రాతఃకాల ఆరాధనతో క్రిస్మస్‌ వేడుకలకు శుభారంభం పలికారు. ఇంఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని వినిపించారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు.

Imageసమస్త మానవాళికి ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. నిస్వార్థంగా ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని కోరారు. చలిని లెక్క చేయకుండ భక్తులు అతి ముఖ్యమైనది గా భావించే ప్రాతః కాల ఆరాధనలో పాల్గొన్నారు. (Christmas) క్రిస్మస్‌‌ సందర్భంగా ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్దతిలో పశువుల పాక ఏర్పాటుచేసి దానికి స్టార్‌‌ వేలాడదీశారు.

Imageమరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్‌‌ ట్రీని ఏర్పాటుచేసి దానిని బెల్స్‌‌, స్టార్స్‌‌, గ్రీటింగ్‌‌ కార్డ్స్‌‌రంగురంగుల బాల్స్‌‌తో అందంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలివస్తున్నారు.

క్రీస్తు బోధనలు సన్మార్గంలో నడిపిస్తాయి

Image

ఖమ్మం: మానవాళికి క్రీస్తు అందిం

చిన సందేశాలు ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం పరిధిలోని బయ్యారంలో సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్​వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు.

CM Revanth announces Rs 35 crore for development of Medak Church, participates in Christmas celebrationsఅనంతరం ఆయన మాట్లాడారు.. ప్రభు యేసు జన్మతో భువి పునీతమైంది అని అన్నారు. మనుషులందరినీ సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్ధేశం చేశారని తెలిపారు. ’ శాంతి సందేశాన్ని ఇచ్చిన క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పెద్ద పండగ. సాటి మనిషికి మేలు చేయడమే మన ముందన్న ప్రధాన కర్తవ్యం. ప్రేమ, కరుణ, దయ గుణాలతో జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలి. కాంగ్రెస్​ ప్రభుత్వం అన్ని మతాలకు సంక్షేమానికి కృషి చేస్తోంది. క్రైస్తవులకు అభివృద్ధి,వారి శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తుంది. ఏసుక్రీస్తు దయతో ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోఫాలను కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్న’ అని భట్టి విక్రమార్క అన్నారు.

అన్ని మతాల సారాంశం మానవత్వమే
క్రిస్‌మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని.. శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్రమంతా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Also read:

TGSP: తప్పుడు పోస్టులను సహించం

Bandi Sanjay: అబద్దాల్లో కాంగ్రెస్ కు ఆస్కార్ ఇవ్వొచ్చు