KCR: ఓటీటీలోకి కేసీఆర్

KCR

రాకింగ్ రాకేశ్ హీరోగా గరుడవేగ అంజి దర్శకత్వంలో వచ్చిన సినిమా కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) (KCR) ఈ సినిమా నవంబర్ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయిందనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.కేసీఆర్’ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్య‌మం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్ర‌సంగాలు విని అత‌డికి అభిమాని అవుతాడు కేశ‌వ చంద్ర ర‌మావ‌త్ (రాకింగ్ రాకేష్‌). ఊరివాళ్లంతా కేశ‌వ చంద్ర‌ర‌మావ‌త్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశ‌వ‌ను అత‌డి మ‌ర‌ద‌లు మంజు (అన‌న్య కృష్ణన్) ఇష్ట‌ప‌డుతుంది. బావ‌నే పెళ్లిచేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. మ‌ర‌ద‌ల్ని కాద‌ని కేశ‌వ చంద్ర ర‌మావ‌త్ బాగా డ‌బ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తాడు. త‌న పెళ్లి అభిమాన‌ నాయ‌కుడు కేసీఆర్ చేతుల మీదుగా జ‌ర‌గాల‌ని కేశవ చంద్ర క‌ల‌లు కంటాడు. కేసీఆర్‌ను క‌ల‌వ‌డం కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? కేశ‌వ చంద్ర ర‌మావ‌త్.. కేసీఆర్‌ను క‌లిశాడా? త‌మ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ స‌మ‌స్య‌ని ఇతడు ఎలా ప‌రిష్క‌రించాడు? మ‌ర‌ద‌లి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.

Image

రాకింగ్ రాకేశ్ హీరోగా గరుడవేగ అంజి దర్శకత్వంలో వచ్చిన సినిమా కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) ఈ సినిమా నవంబర్ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయిందనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.కేసీఆర్’ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్య‌మం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్ర‌సంగాలు విని అత‌డికి అభిమాని అవుతాడు కేశ‌వ చంద్ర ర‌మావ‌త్ (రాకింగ్ రాకేష్‌).

Image

ఊరివాళ్లంతా కేశ‌వ చంద్ర‌ర‌మావ‌త్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశ‌వ‌ను అత‌డి మ‌ర‌ద‌లు మంజు (అన‌న్య కృష్ణన్) ఇష్ట‌ప‌డుతుంది. బావ‌నే పెళ్లిచేసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. మ‌ర‌ద‌ల్ని కాద‌ని కేశ‌వ చంద్ర ర‌మావ‌త్ బాగా డ‌బ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తాడు. త‌న పెళ్లి అభిమాన‌ నాయ‌కుడు కేసీఆర్ చేతుల మీదుగా జ‌ర‌గాల‌ని కేశవ చంద్ర క‌ల‌లు కంటాడు. కేసీఆర్‌ను క‌ల‌వ‌డం కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? కేశ‌వ చంద్ర ర‌మావ‌త్.. కేసీఆర్‌ను క‌లిశాడా? త‌మ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ స‌మ‌స్య‌ని ఇతడు ఎలా ప‌రిష్క‌రించాడు? మ‌ర‌ద‌లి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.

Also read: