చెరువులు, కుంటలు, పార్కుల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా త్వరలోనే పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ (Ranganath) రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలను, ప్రభుత్వ భూమిని కాపాడటమే హైడ్రా పని అని చెప్పారు. ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ జాగాను కాపాడినట్టు చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పై ప్రస్తుతం ప్రజల్లో అవేర్నెస్ వచ్చిందని అన్నారు.
ఏదైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ చెక్ చేసుకుంటున్నారని చెప్పారు. ఔటర్ పరిధిలో 1,025 చెరువులను గుర్తించామని అన్నారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల 5,800 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు ఇచ్చే కంప్లయింట్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.

త్వరలో 12 చెరువుల పునరుద్ధరణ
హైడ్రా త్వరలోనే 12 చెరువులను పునరుద్ధరించనుందని రంగనాథ్ వెల్లడించారు. డేటా, సాంకేతిక పరిజ్ఞానం, ఏరియల్ సర్వే, డ్రోన్ సర్వే డేటా ను కూడా పరిగణనలోకి తీసుకుని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లు నిర్ధరిస్తామని చెప్పారు. చెట్లు పడిపోవడం, నీళ్లు నిలవడం, ఫైర్ యాక్సిడెంట్స్ కంప్లెయింట్స్ తమకు వస్తున్నాయని, వాటిని డీఆర్ఎఫ్ టీమ్స్ ద్వారా అటెండ్ చేస్తున్నామని అన్నారు. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
ఎఫ్ఎం రేడియో
త్వరలోనే హైడ్రా ద్వారా ఎఫ్ఎం రెడియో స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్టు రంగనాథ్ (Ranganath) చెప్పారు. వెదర్ కోసం సెపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెదర్ రాడార్ సిస్టం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు వెదర్ ఫోర్ కాస్ట్ ఇస్తామని చెప్పారు. త్వరలో అన్ని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో వివరాలు మా వెబ్సైట్ లో అందుబాటులో పెడుతామని అన్నారు.
జులై 19 డెడ్ లైన్
జులై 19వ తేదీకి ముందు అనుమతులు తీసుకొని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లను కూల్చబోమని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అయితే కమర్షియల్ బిల్డింగ్స్ పై తప్పక చర్యలు తీసుకుంటామని అన్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత చెరువులు, పార్కులు, నాళాల పై అక్రమ నిర్మాణాలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. హైడ్రా ఎవరికీ ఎన్వోసీలు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సోమవారం హైడ్రా దగ్గరికి వచ్చి కంప్లెయింట్ లు ఇవ్వవచ్చని చెప్పారు.
Also read:
