పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వాస్తవ పరిస్థితులను వివరించారని, మానవత్వ కోణంలో ఆయన వ్యాఖ్యలు చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు అనుకూలంగా (Pawan Kalyan) పవన్ మాట్లాడుతారని అనుకోలేదని చెప్పారు. జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదు అని పవన్ అన్నారన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ,బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డాయన్నారు. జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదన్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డిని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టే కుట్రలు కూడా జరిగాయని అన్నారు. అంబటి రాంబాబు మంచి కళాకారుడని, డ్యాన్సు కూడా బాగా చేస్తారని, ఆయనకు నెక్స్ట్ సినిమాలో మంచి రోల్ ఇస్తారని అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పుష్ప సినిమాకు కలెక్షన్లు పెరిగాయని చెప్పారు. ప్రతిపక్షాలు అడుగుతున్న గురుకుల హాస్టల్ విద్యార్థిని శైలజ కుటుంబాన్ని సీఎం ఎందుకు పరమర్శించలేదంటున్నాయని, అన్ని చోట్లకు వెళ్లడం సీఎం కి సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యమంత్రిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పారు.
పవన్ కల్యాణ్ వాస్తవ పరిస్థితులను వివరించారని, మానవత్వ కోణంలో ఆయన వ్యాఖ్యలు చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు అనుకూలంగా పవన్ మాట్లాడుతారని అనుకోలేదని చెప్పారు. జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదు అని పవన్ అన్నారన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ,బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డాయన్నారు. జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదన్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డిని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టే కుట్రలు కూడా జరిగాయని అన్నారు. అంబటి రాంబాబు మంచి కళాకారుడని, డ్యాన్సు కూడా బాగా చేస్తారని, ఆయనకు నెక్స్ట్ సినిమాలో మంచి రోల్ ఇస్తారని అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పుష్ప సినిమాకు కలెక్షన్లు పెరిగాయని చెప్పారు. ప్రతిపక్షాలు అడుగుతున్న గురుకుల హాస్టల్ విద్యార్థిని శైలజ కుటుంబాన్ని సీఎం ఎందుకు పరమర్శించలేదంటున్నాయని, అన్ని చోట్లకు వెళ్లడం సీఎం కి సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యమంత్రిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పారు.
Also read:

