ManmohanSingh: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్

ManmohanSingh

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ManmohanSingh) కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్‌ (ManmohanSingh) దేశానికి విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలందించారని పేర్కొన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చారన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పారు. 2014లో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందన, తద్వారా ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని సీఎం గుర్తు చేశారు. మన్మోహన్‌ సింగ్‌ ఎల్‌పీజీ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారన్నారు. 2004-14 మధ్య ప్రధానిగా గొప్ప గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఆయన హయాంలోనే ఉపాధిహామీ చట్టం రూపు దిద్దుకుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం, ఎన్‌హెచ్‌ఆర్‌ఎంను ప్రారంభించారని గుర్తు చేశారు.

Image

ఆధార్ కు ఆద్యుడు
సామాజిక విప్లవ కార్యక్రమమైన ఆధార్‌ను మన్మోహన్‌ ప్రారంభించారన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు తెచ్చి ప్రపంచంతో పోటీపడేలా పునాది వేశారని చెప్పారు. ఆయన సేవలు భావితరాలు గుర్తుంచుకోవాలి. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోందని చెప్పారు. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికి తీరని లోటు. ఆయన నీతి, నిజాయతీ, నిబద్ధత కలిగిన నేత. జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ప్రధాని సహా అనేక హోదాల్లో ఉన్నా నిరాడంబరంగా జీవించారు. ఉపాధిహామీ పథకాన్ని అనంతపురం, మహబూబ్‌నగర్‌ నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు.

Image

ఫైనాన్షియల్‌ డిస్ట్ర్రిక్ట్‌లో మన్మోహన్‌ విగ్రహం
మన్మోహన్ సింగ్ 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలకు న్యాయం జరిగేలా చేశారని కొనియాడారు. 2006లో అటవీ హక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని చెప్పారు. ఐటీ రంగంలో శాసించగలుగుతున్నామంటే మన్మోహన్‌ విధానాలే కారణమని చెప్పారు. ఆయన తెలంగాణకు ఆత్మబంధువని, 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన మహా నాయకుడని అన్నారు. తెలంగాణ బిల్లులను ఉభయ సభల్లో పాస్‌ చేయించిన సారథని గుర్తు చేశారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్‌ సింగ్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Image

Also read: