Family Suicide:కూతురికి ఉరేసి, దంపతుల ఆత్మహత్య

Family Suicide:కూతురికి ఉరేసి, దంపతుల ఆత్మహత్య

ముషీరాబాద్​లో విషాదం
హైదరాబాద్: ముషీరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య (Family Suicide)చేసుకుంది. నాలుగేండ్ల కూతురికి ఉరేసి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్యభర్తలు సురేశ్ బాబు, చిత్రలేఖ, కూతురు తేజస్విని ప్రాణాలు వదిలారు(Family Suicide). వీరిది కర్నూలు జిల్లా లక్ష్మీపురం అని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
గోడపై సూసైడ్​నోట్(Family Suicide)
తమ చావులకు బిర్లా సైన్స్ సెంటర్ లో వర్క్ చేస్తున్న శ్యామ్ కొఠారి, గీత రావు కారణం అంటూ మృతురాలు చిత్రకళ ఇంటి గోడపై సూసైడ్ నోట్ రాశారు.
అక్కడ పని చేస్తున్నప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేసి జాబ్ నుంచి తొలగించారని పేర్కొన్నారు. వాళ్లు చేస్తున్న ఫ్రాడ్స్ ను నిలదీసినందుకు తనపై కక్ష పెట్టుకున్నారన్నారు. అపాయింట్మెంట్ లెటర్ పే స్లిప్స్ అడిగిన ఇవ్వలేదన్నారు. న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్ కు ఎన్నో ట్విట్టర్ లో మొరపెట్టుకున్న స్పందించలేదన్నారు.గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య (Family Suicide)చేసుకుంది.

Read More: