విజయవాడ హైవే (Hyderabad) ఫుల్ అయ్యింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు భారీగా వాహనాలు బారులు తీరాయి. గంటకు వెయ్యి కార్లు పంతంగి టోల్ ప్లాజా నుంచి ఏపీ వైపు వెళ్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని చిల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి బెంగళూరు హైవే(Hyderabad)పై కాస్తా రద్దీ తక్కువగా ఉంది.
![]()
సాయంత్రానికి అటువైపు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సంక్రాంతికి ఊళ్లకు వెళ్తున్నవారితో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు సందడిగా మారాయి.

మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్ స్టేషన్ కు సైతం నిండిపోయింది. నిన్న రాత్రి నుంచే టీజీఎస్ ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుపుతోంది.

రాజేంద్రనగర్, ఆరాంఘర్ చౌరస్తాల వద్ద ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్నారు. 160 బస్సులపై భారీగా జరిమానాలు విధించారు. 16 బస్సులను సీజ్ చేశారు.
Also read :
Dharani : తప్పులు చేసినోళ్లపై చర్యలు
Hyderabad : హైవే ఫుల్.. హైదరాబాద్ ఖాళీ..!

