MP Arvind : మీ విచక్షణకు వదిలేస్తున్నా..?

Aravindh

పసుపు బోర్డు ఏర్పాటు గురించి ఎంపీ అరవింద్ (MP Arvind) చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. అభినందనలు తెలుపడం కూడా తప్పేనా..? అంటూ ప్రశ్నించారు. అరవింద్ (MP Arvind) చేసిన వ్యాఖ్యలను ఆయన విచక్షణకు వదిలేస్తున్నానని అన్నారు. ‘పసుపు బోర్డు ఏర్పాటు అర్ధరాత్రి ప్రకటించి, తెల్లారి ప్రారంభించినా మేము తప్పు పట్టట్లేదు.. ఫెడరల్ స్ఫూర్తి నీ కూడా పాటించలేదు మీరు. కానీ మీరు నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కాబట్టి… మీకు కొన్ని విషయాలు చెప్తా. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక మూడు సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశా. రెండు సార్లు మా కమిషనర్ తో లేఖ రాయించాను. మా సీఎం తో కూడా కేంద్రాన్ని అడిగించాం. నేను ఎక్కడ ఉన్నా… ఆ శాఖ కి పూర్తిగా న్యాయం చేస్తా. కావాలంటే మీ బీజేపీ పెద్దలను అడుగు నా పనితీరు గురించి” అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. నిజామాబాద్ రైతుల సుదీర్ఘ పోరాటం, చిరకాల నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగానే కాక, ఒక రైతుగా తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిన అంశం ఇదని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశానని తెలిపారు. ఈ సందర్భంలో తన రాజకీయ జీవితం గురించి ఎంపీ అరవింద్ (MP Arvind) చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు.

 

Also read :

Tirupati: మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత

Khumbhamela: కుంభమేళా స్టార్ట్.. 3కోట్ల మంది స్నానాలు