kolakata: సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు

Kolkata

కోల్ కతా (kolakata) ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ ని దోషిలా తేల్చిన సీల్ధా కోర్టు ఆయనకు జీవితఖైదును ఖరారు చేసింది. రూ. 50 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు ప్రకాKolkataరం ఆయన మరణించే వరకు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. అలాగే మృతురాలి కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం అందించాలని(kolakata) పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆస్పత్రిలో మెడిసిన్ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సెకండియర్ చదువుతున్న జూనియర్‌ వైద్యురాలిపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు.

ఈ దుర్ఘటనపై పోలీసుల అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కేసును సీబీఐకి అప్పగించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసును సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తొలుత సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి అభిజిత్‌ మండల్‌ను అరెస్టు చేశారు. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వీరిద్దరూ అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఇవాళ సీల్ధా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పునకు ముందు సీబీఐ తరఫు న్యాయవాది సంజయ్ కి ఉరిశిక్ష విధించాలని పట్టుబట్టారు. అయితే అరుదైన కేసుల్లో మాత్రమే మరణ శిక్ష విధిస్తామని, ఇది అలాంటి కేసు కాదని న్యాయమూర్తి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Also read: