అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ట్రంప్ (Trump) విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు వాషింగ్టన్ బీసీ లో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ తన మద్దతు దారులకు కృతజ్ఞతలు తెలిపారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎంఏజీఏ) షర్టులు ధరించిన వేలమంది ట్రంప్ (Trump) అభిమానులు దేశం నలు మూలల నుంచి వాషింగ్టన్ కు వచ్చి వర్షం, మంచును లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ… తాను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానని ప్రకటించారు. అమెరికా వాణిజ్య విధానాన్ని రక్షలిస్తామని, ఇతర దేశాల నుంచి దిగుమతులపై పన్నులు వేసి ఆ సొమ్ముతో సగటు అమెరికన్లను లబ్ది కలిగేట్లు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా గా మారుస్తా అని చెప్పారు. కాగా ర్యాలీలో కళాకారులు వైఎంసిఏ పాటను పాడుతూ నృత్యం చేశారు.
బ్యాండ్ సభ్యులు డాన్స్ చేస్తుండగా… ట్రంప్ కూడా తనదైన శైలిలో స్టెప్పులు వేశారు ఈ ర్యాలీలో ట్రంపు తో పాటు ఎలాంటి మాస్క్ కూడా కుమారుడితో కలిసి వేదిక పైకి వచ్చిన మాస్క్… కొన్ని శతాబ్దాల పాటు అమెరికాను పటిష్ట దేశంగా ఉంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్షణం నుంచి అమెరికా స్వర్ణ యుగం ప్రారంభమైందని ప్రకటించారు. మళ్లీ అమెరికా గొప్ప దేశం అవుతుందని భరోసా ఇచ్చారు. ప్రపంచం మొత్తం అమెరికాను చూసి కుళ్లుకుంటుందని మద్దతుదారుల హర్షద్వనాల మధ్య వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై జరిగిన హత్యాయత్యాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. బుల్లెట్ తన చెవిని చీల్చుకుంటూ వెళ్లిందని, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా మార్చే కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు తనను రక్షించాడని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అధ్యక్షుడిగా భారీ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. వలసలపై భారీ ఎత్తున నియంత్రణలు పెడదామని, అక్రమ వలసలపై ఉక్కుపాతం మోపుతామని వ్యాఖ్యానించారు.
దేశంలో అక్రమంగా ఉంటున్న లక్షలాదిమంది నేరగాలను వెంటనే వెలగొడతామన్నారు. చమురు తవ్వకం మీద బైడెన్ నిర్ణయాలను తిరగడదామని ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని సాయుధ బలగాలను మోహరిస్తామని చెప్పారు. సరిహద్దు దాటి వచ్చి ఆశ్రయం కోరేవారు ఇకనుంచి కోర్టు విచారణ తేదీ వచ్చే వరకు సరిహద్దుల్లోని ఉండే విధంగా పాత విధానాన్ని పునరుద్దిస్తామని ప్రకటించారు.అమెరికాలో అక్రమంగా ఉంటున్న వ్యక్తులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ప్రస్తుతం ఆటోమాటిక్ పౌర సత్వం ఇస్తున్నారని దాన్ని ఎత్తేస్తామని అన్నారు.
మంగళవారం సూర్యుడు అస్తమించే సమయానికి అమెరికాపై జరుగుతున్న దాడి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల అమెరికా పతనానికి తెరపడిందని తక్షణమే తెరపడిందని చెప్పారు. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులో దోషులు అభియోగాలు ఎదుర్కొంటున్న 1500 మందికి పైగా బాధితులను ఉపశమనం కల్పిస్తానని ఓవల్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోపే బ్రైడెన్ సర్కారు తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలను రద్దు చేస్తానని వెల్లడించారు.
ఆయన ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలు అమలు కాకుండా చూస్తానని స్పష్టం చేశారు. ఉక్రేణిలో యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ చెప్పారు. పచ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత లనూ అదుపు చేస్తా అన్నారు. మూడో ప్రపంచ యుద్ధం గా రాకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు మహిళా క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని దేశంలో ఆడ మగ రెండు జెండర్ లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.
జాన్ ఎఫ్ కెనాడి, రాబర్ట్ యఫ్ కెనాడి, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసు ఫైళ్లను బహిర్గతం చేస్తానని ప్రభుత్వంలో పారదర్శక తను తీసుకొచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తానని వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పాలనపరమైన అనేక ఆదేశాలు జారీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
Also read:

