విదేశాల నుంచి వలసొచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే వారికి( పుట్టిన పిల్లలలకు) సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రకటించారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. దీనిపై ట్రంప్ (Trump) ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలస విధానంపై తీసుకోబోయే చర్యలకు ఇది నాంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని 30 దేశాలు ఈ తరహా పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో ఆ దేశం 14వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇందులో భాంగా శరణార్థుల పిల్లలకు జన్మత: పౌరసత్వం అందిస్తోంది. అప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. కాగా, ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉభయ సభల్లో మూడింట్ రెండొంతుల మెజార్టీ ఉండాలి. ఈ ప్రక్రియ కొలిక్కి రావడానికి సంవత్సరాలు పడుతుందనే అభిప్రాయం ఉంది. అమెరికా1992 నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని సవరించలేదు.
విదేశాల నుంచి వలసొచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే వారికి( పుట్టిన పిల్లలలకు) సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలస విధానంపై తీసుకోబోయే చర్యలకు ఇది నాంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని 30 దేశాలు ఈ తరహా పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో ఆ దేశం 14వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇందులో భాంగా శరణార్థుల పిల్లలకు జన్మత: పౌరసత్వం అందిస్తోంది. అప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. కాగా, ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉభయ సభల్లో మూడింట్ రెండొంతుల మెజార్టీ ఉండాలి. ఈ ప్రక్రియ కొలిక్కి రావడానికి సంవత్సరాలు పడుతుందనే అభిప్రాయం ఉంది. అమెరికా1992 నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని సవరించలేదు.
Also read:

