ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్ సీఎల్ హైదరాబాద్ (Hyderabad) లో కొత్త క్యాంపస్ ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్ సీఎల్ గ్లోబల్ టెక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తో చర్చలు జరిపారు. ఈ మేరకు 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ సీఈవో సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఈ సెంటర్ హెచ్సీఎల్ కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందిస్తుంది. ఈ కొత్త సెంటర్ ఏర్పాటు వల్ల దాదాపు ఐదు వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ఐటీలో ప్రతిభా వంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్సీఎల్ గ్లోబల్ నెట్ వర్క్ సెంటర్ గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ తెలిపారు. తెలంగాణలో హెచ్సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచ ఐటీ హబ్ గా హైదరాబాద్ (Hyderabad) తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్‌ను ప్రారంభించాలని కోరారు. స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్సీఎల్ టెక్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. 2007 నుంచే హెచ్సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. కొత్త కేంద్రంతో హైదరాబాద్ లో హెచ్సీఎల్ మొత్తం అయిదు సెంటర్లను విస్తరించనుంది.
ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్సీఎల్ టెక్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. 2007 నుంచే హెచ్సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. కొత్త కేంద్రంతో హైదరాబాద్ లో హెచ్సీఎల్ మొత్తం అయిదు సెంటర్లను విస్తరించనుంది.
Also read:
- Uttam Kumar Reddy: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
- Kurnool District: రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు మృతి

