Murder: భార్యను చంపి కుక్కర్‌ లో ఉడికించాడు

Murder

కంటికి రెప్పలా చూసుకుంటానని భాష చేసినవాడే కాలయముడయ్యాడు. కడదాకా కాపురం చేస్తానని మాట ఇచ్చిన వాడే అతి కిరాతకంగా (Murder) చంపి శరీరాన్ని కోసి కుక్కర్ లో ఉడికించి, ఎముకలను పొడి చేసి చెరువులోకి విసిరేశాడు. (Murder)ఈ హృదయ విధారక ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన గురుమూర్తి, వెంకటమాధవి(35) దంపతులు నివాసం ఉంటున్నారు. గురుమూర్తి ప్రస్తుతం కంచన్ బాగ్ లోని డీఆర్డీవోలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ నెల 13 నుంచి వెంకటమాధవి కనిపించడం లేదని గురుమూర్తి అత్త, మామలకు సమాచారం ఇచ్చాడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ మాధవి తల్లిదండ్రులు మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసే సమయంలో గురుమూర్తి కూడా ఠాణాకు వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

కేసు విచారణలో భాగంగా పోలీసులు గురుమూర్తిని విచారించగా.. తానే హత్య చేశానని ఒప్పుకొన్నాడు. తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి ఉడికించినట్టు ఒప్పుకొన్నాడు. కుక్కర్ లో ఉడికించలేని శరీర భాగాలను ఎండలో ఎండబెట్టి రోకలితో పొడి చేసినట్టు చెప్పాడు. ఆ తర్వాత కుక్కర్ లో ఉడికించిన భాగాలను, ఎముకల పొడిని జిల్లెల్లగూడ చెరువులో పడేసినట్టు చెప్పాడు. పోలీసులు జిల్లెల్లగూడ చెరువులో గాలించి వెంకటమాధవి శరీర భాగాలను వెలికి తీశారు. మృతురాలి తల్లి ఉప్పాల సుబ్బమ్మ ప్రస్తుతం తూప్రాన్ మండలం దండుపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆమె తన పెద్దకుమార్తె వెంకట మాధవిని 13 ఏండ్ల క్రితం గురుమూర్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ నెల 16న తన కుమార్తెకు, అల్లుడికి చిన్నపాటి గొడవ జరిగిందని ఈ క్రమంలో ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఇంట్లో కనిపించడం లేదంటూ తమకు ఫిర్యాదు చేశారని మీర్ పేట పోలీసులు తెలిపారు.

Also read: