Thummala: రుణమాఫీ చేసినందుకా రైతు దీక్ష?

Thummala

‘రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశాం.. సన్నవడ్లకు బోనస్.. సాగుభూమి భరోసా.. భూమిలేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నం.. కాంగ్రెస్​ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రయారిటీ (Thummala) ఇస్తుంది. బీఆర్ఎస్​నల్గొండలో రైతు దీక్ష ఎందుకు చేస్తున్నారు.. రుణమాఫీ చేయడం మీకు ఇష్టంలేదా..? రైతులకు ఆదుకుంటే మీకు ఎందుకు కడుపుమంట. పదేండ్లు రైతులను మాయమాటలతో మోసం చేశారు.. ఇప్పుడు మీరు చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండ జిల్లా భువనగిరిలో మార్కెట్​కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. నల్గొండలో రైతు దీక్ష చేయడానికి బీఆర్ఎస్​నాయకులు వస్తే పదేండ్లు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలన్నారు. ‘ దొడ్డు బియ్యం మాఫియా ఉంది కాబట్టి ప్రజలకు త్వరలోనే సన్నబియ్యం అందిస్తం. బీఆర్ఎస్​చిల్లర రాజకీయాలు చేస్తుంది. ప్రాణాలను తెగించి రైతులు, ప్రజల గౌరవాన్ని కాపాడుతాం. వాళ్లు పదవులు పోయిన బాధను ప్రజలపై రుద్దుతున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు’ అని మంత్రి తుమ్మల (Thummala) అన్నారు.

Image

‘రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశాం.. సన్నవడ్లకు బోనస్.. సాగుభూమి భరోసా.. భూమిలేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నం.. కాంగ్రెస్​ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తుంది. బీఆర్ఎస్​నల్గొండలో రైతు దీక్ష ఎందుకు చేస్తున్నారు.. రుణమాఫీ చేయడం మీకు ఇష్టంలేదా..? రైతులకు ఆదుకుంటే మీకు ఎందుకు కడుపుమంట. పదేండ్లు రైతులను మాయమాటలతో మోసం చేశారు.. ఇప్పుడు మీరు చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండ జిల్లా భువనగిరిలో మార్కెట్​కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. నల్గొండలో రైతు దీక్ష చేయడానికి బీఆర్ఎస్​నాయకులు వస్తే పదేండ్లు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలన్నారు. ‘ దొడ్డు బియ్యం మాఫియా ఉంది కాబట్టి ప్రజలకు త్వరలోనే సన్నబియ్యం అందిస్తం. బీఆర్ఎస్​చిల్లర రాజకీయాలు చేస్తుంది. ప్రాణాలను తెగించి రైతులు, ప్రజల గౌరవాన్ని కాపాడుతాం. వాళ్లు పదవులు పోయిన బాధను ప్రజలపై రుద్దుతున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు’ అని మంత్రి తుమ్మల అన్నారు.

Also read: