Hyderabad: కాంగ్రెస్.. ఈనో ఫ్లెక్సీలు

Hyderabad

‘పెట్టుబడులు చూసి కడుపు మంటా..? అయితే ఈనో వాడండి.. ఈనో ఆన్.. కడుపు మంట గాన్..!’ అంటూ హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన రాష్ట్రానికి 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వాటిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ పెట్టుబడులు రావడం, (Hyderabad) తెలంగాణ అభివృద్ధి చెందుతుండటాన్నికేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీలపై కేసీఆర్ కడుపు పట్టుకున్న ఫొటో వేసి పక్కనే ఈనో ప్యాకెట్ బొమ్మ వేశారు. మరో ఫ్లెక్సీలో కేటీఆర్ కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న ఫొటో వేసి పక్కనే ఈ నో ప్యాకెట్ బొమ్మ వేసి పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ఈనో వాడండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. #DigestTheGrowth పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

Image

‘పెట్టుబడులు చూసి కడుపు మంటా..? అయితే ఈనో వాడండి.. ఈనో ఆన్.. కడుపు మంట గాన్..!’ అంటూ హైదరాబాద్  నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన రాష్ట్రానికి 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వాటిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ పెట్టుబడులు రావడం, తెలంగాణ అభివృద్ధి చెందుతుండటాన్నికేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీలపై కేసీఆర్ కడుపు పట్టుకున్న ఫొటో వేసి పక్కనే ఈనో ప్యాకెట్ బొమ్మ వేశారు. మరో ఫ్లెక్సీలో కేటీఆర్ కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న ఫొటో వేసి పక్కనే ఈ నో ప్యాకెట్ బొమ్మ వేసి పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ఈనో వాడండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. #DigestTheGrowth పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

Also read: